నోటి ద్వారా తీసుకునే టీకాతో కరోనా వ్యాప్తికి కళ్లెం!
వాషింగ్టన్: నోటి ద్వారా తీసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ఓ కొవిడ్ టీకా.. వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా నిరోధించడంలోనూ మెరుగ్గా దోహదపడుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. నోటి నుంచి వెలువడే తుంపర్లలో వైరస్ సంఖ్యను అది గణనీయంగా తగ్గిస్తున్నట్లు నిర్ధారించింది. తాజా అధ్యయనంలో భాగంగా అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు.. అడినోవైరస్ ను వాహకంగా ఉపయోగించుకునేలా రూపొందించిన ఓ కొవిడ్ టీకాను పరీక్షించారు. ఈ వ్యాక్సిన్ ను మాత్ర రూపంలో నోటి...