అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. లక్ష విలువైన హౌస్ వైర్ స్వాధీనం.?
నిర్మల్ జిల్లా: ఎలక్ట్రికల్ షాపులు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నిర్మల్ పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల రతన్ ఎలక్ట్రికల్ దుకాణంలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రూ. 5 లక్షల విలువైన హౌస్ వైర్ దొంగిలించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి దొంగతనం చేసినట్లు గుర్తించారు. వాహన కలర్ ఆధారంగా...