Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 May 2022, 9:49 pm Posted by : Anjaneyulu Dega

ఇంక్యుబేటర్ లో వేడికి ఇద్దరు పసికందుల మృతి.!

హైదరాబాద్: పాతబస్తీ ఫలక్నుమాలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ప్రసవం కాగానే వేడి కోసం ఇద్దరు శిశువులను వైద్యులు ఇంక్యుబేటర్ పెట్టారు. ఇంక్యుటేటర్ పెట్టి వదిలేయడంతో వేడికి ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి ఛాతీ భాగంలో కాలిన గాయాలు ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పిల్లలు పుట్టినప్పుడు వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. ఇంక్యుబేటర్లో వేడి వల్లే ఇద్దరు చనిపోయారాని బాధితులు ఆరోపిస్తున్నారు.

మృతి చెందిన ఇద్దరు చిన్నారుల ఛాతీ భాగంలో ఉన్న గాయాలు కాలిన గాయాల్లాగే ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.