Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 May 2022, 2:48 pm Posted by : Anjaneyulu Dega

సీఐటీయూ జిల్లా మహాసభలను విజవంతం చేయండి.!

సీఐటీయూ జిల్లా మహసభలకు ఆర్థిక సహాయం అందించిన లిక్కర్ గోదాం హమాలీలు..

మంచిర్యాల జిల్లా: హజిపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలోని లిక్కర్ గోదాంలో పనిచేస్తున్న సీఐటీయూ అనుబంధం సంఘం హమాలీ యూనియన్ కమిటీ సభ్యులను ఈ రోజు ఉదయం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భి. మధు గారు సందర్శించి వారితో మాట్లాడి అనంతరం జిల్లా మహాసభలపై మాట్లాడటం జరిగింది. అనంతరం హమాలీ యూనియన్ సభ్యులు అందరు కలిసి మే 28,29న జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీఐటీయూ 4వ జిల్లా మహాసభలకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని సీఐటీయూ జిల్లా కమిటీకి ఇవ్వడం జరిగింది.మిగతా మేధావులు,అభ్యుదయ వాదులు,విద్యావంతులు,అన్ని రాజకీయ పార్టీలు,నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరు కూడా సీఐటీయూ జిల్లా మహాసభలకు ఆర్థిక సహాయ, సహకారాలు అందించగలరాని కోరుతున్నాము..

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి హమాలీ యూనియన్ అధ్యక్షులు శంకర్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు..