అడుగడుగున బ్రహ్మరథం.. బండి సంజయ్ యాత్రకు ఘన స్వాగతం
బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సహం...మండల ప్రజలలో నయా జోష్. టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బండి సంజయ్. రంగారెడ్డి జిల్లా, కేశంపేట రూరల్:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది.ఇందులో భాగంగా మంగళవారం కేశంపేట మండలంలోని తొమ్మిది రేకుల గ్రామంలో పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు అందే బాబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బండి సంజయ్ బీజేపీ శ్రేణులు...