కారు టైరు కింద పడి నలిగిపోయిన చిన్నారి.?
హైదరాబాద్: నగరంలోని నాచారం పీఎస్ పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. కారు రివర్స్ తీస్తుండగా కారు కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాచారం పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న యువతిని ఎక్కించుకోవడానికి ఓలా క్యాబ్ వచ్చింది. యువతి కారులో ఎక్కిన తర్వాత క్యాబ్ డ్రైవర్ రివర్స్ తీసుకున్నాడు. అదే సమయంలో వాహనం వెనక చిన్నారి ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ కారును అలాగే వెనక్కి తీసుకెళ్లాడు. వెనక...