శ్రీలంకలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఎంపీ మృతి..!

కొలంబో: శ్రీలంకలో గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొలంబోలో పార్లమెంట్ భవనం వద్ద శాంతియుతంగా నిరసనతెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల మృతిచెందారు. నిట్టాంబువలో ఎంపీ కారును ఆందోళనకారులు అడ్డుకోగా.. ఆయన ఎస్యూవీ కారు నుంచి తుపాకీ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన నిరసనకారులు...