అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

మంచిర్యాల జిల్లా: లోని రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వీరు పట్టుబడ్డట్లు డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ దగ్గరలోని ఎక్స్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై గోదావరిఖని వైపు నుండి బెల్లంపల్లి వైపు వెళ్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా...