ఆ వార్తలు నమ్మొద్దు.. నీట్ పీజీ పరీక్ష వాయిదా లేదు

దిల్లీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన 'నీట్ పీజీ ప్రవేశ 2022 పై ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేశారంటూ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో ఓ నకిలీ సర్క్యులర్ బయటికొచ్చింది. ఇది వైరల్ అవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది. నిజానికి ఈ పరీక్ష ఈ ఏడాది మార్చి...