ఆర్టీఏ ఆర్టీసి అధికారులు సంయుక్తంగా వాహనాల తనీఖీ
జగిత్యాల జిల్లా: జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే రోడ్డులో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు శనివారం సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. దాదాపు 43 వాహనాలు సరియైన పత్రాలు లేనందున తమ అధీనంలోకి తీసుకొని జగిత్యాల బస్ డిపోకి తరలించడం జరిగిందని, వీరికి దాదాపు 3 నుండి 5 లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము విధించవచ్చని జగిత్యాల మోటార్ వాహన తనిఖీ అధికారి జి. వంశీదర్ తెలిపారు. నేటి నుండి ప్రతి రోజు వాహనాల తనిఖీ జరుగుతుందని కావున వాహన యజమానులు అన్ని రకాల...