విద్యార్థిని మృతదేహానికి రీ పోస్టుమార్టం..!
పెనుగొండ: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేస్తున్నారు. పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. ప్రేమించిన వ్యక్తే తేజస్వినిని నమ్మించి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులకు అనుమానాలు ఉండటంతో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "తేజస్విని, సాదిక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 4న యువతికి సాదిక్ ఫోన్ చేసి రమ్మన్నాడు. పొలంలోని రేకుల షెడు ఆమెను తీసుకెళ్లాడు....