ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉగ్ర ప్రకంపనలు..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: హరియాణాలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడిన వ్యవహారంలో ఆదిలాబాద్ పేరు ప్రస్తావనకు రావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ముష్కరులు ఇక్కడకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు హరియాణా హోంమంత్రి వెల్లడించడం ప్రకంపనలు సృష్టించింది. జాతీయ దర్యాప్తు సంస్థ మూడురోజుల కిందటే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో... వారు దీన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులతో అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడకు ఆయుధాలను తరలిస్తే అనుమానాలకు ఆస్కారం ఉండదనే...