కష్టకాలంలో మెరుగైన వైద్యం అందించాలి..
మంచిర్యాల జిల్లా: డాక్టర్స్ కష్టకాలంలో పేదలు, సామాన్యులకు సహాయ, సహకారాలతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపి వైద్యులు, అంబులెన్సుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి లో వైద్యులు, అంబులెన్స్ యజమానులు డ్రైవర్లు ఒక ప్రాణం కాపాడే రక్షకుల ఉండాలన్నారు. ఆపదలో ఆదుకునే అంబులెన్స్ డ్రైవర్లు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోదిస్తున్నా కొందరు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారన్నారు. అత్యవసర చికిత్స సమయంలో ప్రజల అవసరాలను...