రాహుల్ గాంధీ చేతకాని తనమే భాజపాను గెలిపిస్తోంది. బాల్క సుమన్
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తీరు మార్చుకోక పోతే తగిన సమాధానం ఇస్తాం: బాల్క సుమన్.. హైదరాబాద్: రెండు జాతీయ పార్టీల నేతలు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆరు దశాబ్దాలుగా భాజపా, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ నుంచి ప్రజలు విముక్తి కావాల్సి ఉందన్నారు. అభివృద్ధిలో చైనా, అమెరికాలను మించి భారత్ దూసుకెళ్లాలని సీఎం కేసీఆర్ అనడం...