భారత్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం..!

పాక్ నుంచి ఆదిలాబాద్ కు ఆయుధాలు పేలుడు పదార్థాలు.. భారత్ లో పాకిస్థాన్ తలపెట్టిన భారీ కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా బుల్లెట్లు, గన్పౌడర్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదుల నుండి ఆదేశాలు అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్ కు మందుగుండు...