Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 May 2022, 5:05 pm Posted by : Anjaneyulu Dega

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ సస్సెన్షన్..!

ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని బంగారి గూడ మైనార్టీ గురుకులంలో గత నెల 19న ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఇద్దరిపై వేటుపడింది. ప్రిన్సిపాల్ అతియా సుల్తానాను సస్పెండ్ చేయడంతో పాటు అవుట్ సోర్సింగ్ విధానంపై సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ వార్డెన్ గా పనిచేస్తున్న కాహాక్ నాయర్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ తెలంగాణ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ షఫీఉల్లా ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తెలిపారు. ఈ గొడవపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిక అందించామని పేర్కొన్నారు..