Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 May 2022, 5:43 pm Posted by : Anjaneyulu Dega

సీఎస్ సోమేష్ బదిలీకి రంగం సిద్ధం.?

తెలంగాణ: తెలంగాణ సోమేష్ కుమార్ ను బదిలీ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సీఎం ఆదేశించినా సీఎస్ పనుల్లో దూకుడు ప్రదర్శించడం లేదని టాక్. ఇటీవల చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా సీఎస్ సోమేష్ కుమార్ పై ఆగ్రహం. వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా అమలు పరచడంలో తెలంగాణ సీఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. దీంతో ప్రభుత్వం సీఎస్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో కొత్త సీఎస్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ధికశాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణరావు నూతన సీఎస్ గా వస్తారని చర్చ జరుగుతుంది. పరిపాలనా వ్యవహారాల్లో కూడా సీఎస్ నెమ్మదిగా ఉన్నారని, కనీసం కలెక్టర్లతో ఇప్పటి వరకు సమీక్షలు జరపలేదన్న విమర్శలున్నాయి. మరో వైపు విపక్ష నాయకులు సీఎస్ పై అవినీతి ఆరోపణలు చేయడం కూడా చర్చనీయాంశమైంది..