పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయమా..?: జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్లోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారిన విషయం. తెలిసిందే. ఆయనతో పాటు నేపాల్లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో విపక్షాలు తీవ్రంగా విరుచుపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.. రాహుల్ గాంధీ ఓ పెళ్లికి వెళ్లిన వీడియోను చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు....