Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 May 2022, 12:43 pm Posted by : Anjaneyulu Dega

రంజాన్ వేళ అక్కడ ఉద్రిక్తత.. ఇంటర్నెట్ బంద్.!

జోధ్ పూర్: రంజాన్ పండగ వేళ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ లో అల్లర్లు చెలరేగాయి. ఈద్ ను పురస్కరించుకుని జోధ్పుర్ లోని జలోరీ గేట్ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు.

పోలీసు బందోబస్తు నడుమ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ఘర్షణలపై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు..