ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఆంధ్ర ప్రదేశ్: గ్రామీణ రహదారుల రిపేర్ కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, గ్రామీణ రహదారులు, తాగునీటిపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ చెరువుకు కెనాల్స్, ఫీల్డర్ ఛానెల్స్కి లింక్ చేయగలిగితే నీటి ఎద్దడిని...