ఈ పానీయాలతో వేసవిలోనూ హుషారుగా!
మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బోలెడు సహజ సిద్ధమార్గాలున్నాయి.. అందులో ఒకటి చల్లటి పానీయాలు తీసుకోవడం. ఇవి దాహార్తి తీర్చడంతోపాటు శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే ఆ రసాలు//పానీయాలు ఏంటో చూద్దామా.. మజ్జిగ... దీంట్లో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బి12 మెండుగా ఉంటాయి. కప్పు పెరుగులో రెండు కప్పుల నీళ్లు పోసి తగినంత జీలకర్ర పొడి, నల్లుప్పు, చిటికెడు ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి తాగితే సరి. రుచికరమైన మజ్జిగ సిద్ధం. దీన్ని తరచూ తాగుతూ...