అబద్ధాల సంఘం అధ్యక్షుడు కేసీఆర్: రేవంత్ రెడ్డి
తెలంగాణ: తెలంగాణ సీఎం కేసీఆర్. అబద్ధాల సంఘం అధ్యక్షుడని చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ సమకాలీన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ను తొలి ఎన్నికల్లో గెలిచారని, ఆ తర్వాత ప్రలోభాలతో రెండవ ఎన్నికలతో అధికారం దక్కించారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ రాక్షస రాజకీయ క్రీడకు తెరలేపారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు చితికి పోయారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం సమస్యను సృష్టించారని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని దారుణ పరిస్థితుల్లోకి కేసీఆర్ నెట్టారని,...