అధికారుల నిర్లక్ష్యం.. కూలీలకు అపార నష్టం.!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: తాండూర్ మండలంలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో మండల ప్రత్యేక అధికారి గజానన్ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా బీజేపీ తాండూరు మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100(వంద) రోజుల పని కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా 4 వేల కోట్లు తెలంగాణకు కేటాయిస్తుండగా అధికారుల అలసత్వంతో లక్ష్యం నీరుగారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి...