అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ధిల్లీ: దేశవ్యాప్తంగా సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కు చేరాయని, సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం అందుతోందని అన్నారు. అందువల్ల వేడి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా...