Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 May 2022, 11:11 am Posted by : Anjaneyulu Dega

అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ధిల్లీ: దేశవ్యాప్తంగా సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కు చేరాయని, సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం అందుతోందని అన్నారు. అందువల్ల వేడి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏప్రిల్ లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపిన విషయాన్ని గుర్తుచేశారు.

ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలకు సంబంధించిన జాతీయ కార్యాచరణలోని అంశాలపై ప్రచారం చేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం కింద వేడి సంబంధ అనారోగ్యాలపై నిఘా ఉంచాలని లేఖలో పేర్కొన్నారు.