వీధుల్లో సైకిల్ పై పాలు అమ్మాను: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి తన గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాను మంత్రిగా ఉన్నప్పటికీ గతంలో చాలా కష్టాలు పడినట్లు వివరించారు. సైకిల్పై వీధివీధికీ తిరుగుతూ పాలు, పూలు విక్రయించినట్లు చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన మే డే వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు. కష్టపడితే సాధించలేనిదీ ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు. క్రమేపీ ఎదుగుతూ విద్యా సంస్థలను స్థాపించినట్లు చెప్పారు. తన కళాశాలలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఇంతలా ఎదగడానికి స్వయంకృషి కారణమని, రెక్కల కష్టంపై పైకి వచ్చానని...