వీధి రౌడీల్లా ప్రవర్తించిన ఇంజనీరింగ్ విద్యార్థులు..?
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం గంగారంలో ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...ఓ విద్యార్థి జన్మదిన వేడుక సందర్భంగా జూనియర్ బ్యాచ్ విద్యార్థులు కళాశాల సమీపంలోని తోటకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీనియర్ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఒకరిని ఓ జూనియర్ సిగరెట్ ఇవ్వమని అడిగాడు. సిగరెట్ ఇచ్చిన సీనియర్ విద్యార్థి .. జూనియర్‌ను 'ఏం చదువుతున్నావ్' అని అడిగాడు. తొమ్మిదో తరగతి అని వెటకారంగా చెప్పడంతో తోటలో పరస్పరం దాడి చేసుకున్నారు. అంతటితో...