పోలీస్ ఉద్యోగ అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త!
టీఎస్ఎల్పీఆర్టీ పేరుతో నకిలీ వెబ్సైట్.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..? హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో చేపట్టనున్న నియామకాల ప్రక్రియను నిర్వహిస్తున్న 'తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ _ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)' పేరుతో అంతర్జాలంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ ను సృష్టించారు. డీజీపీ కార్యాలయంలోని రిక్రూట్మెంట్ బోర్డు విభాగాధికారులు ఇంటర్నెట్ లో నకిలీ వెబ్సైట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దీన్ని ఇంర్నెట్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ...