దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం.!
గుంటూరు జిల్లా: ఉమ్మడి గుంటూరు జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వారంరోజుల్లో నాలుగో ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధిత దంపతులు చెబుతున్నారు. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్లో దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు...