కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీకి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. "మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత రాజ్యంలో ఉన్నామా? కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష. కేసీఆర్ ఒక పిరికి పాలకుడు... ఆయన పాలనకు మరో 12...