నిరుద్యోగ యువతకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..!
హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త తెలియజేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్లపై 20 శాతం రాయితీ కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు ఈ పాస్లను కొనసాగిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బస్పన్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో...