తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

ఏపీకి వారంలోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించండి.. తెలుగు అకాడమీ కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం.. ధిల్లీ: తెలుగు అకాడమీ విభజన వ్యవహారంలో తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి వారంలోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతిచ్చింది. అలాగే ఏపీకి చెల్లించాల్సిన రూ.92.94 కోట్లలో పెండింగ్ సొమ్మును వారంలోగా ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం సొమ్ముకు...