నోరు పారేసుకున్న పాక్ ప్రధాని.. ఖండించిన భారత్.?
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్.. భారత్ పై నోరుపారేసుకున్నారు. ఆ పర్యటన అంతా ఓ 'డ్రామా' అంటూ ఆరోపించారు. కాగా.. పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన వ్యవహారాలపై పాక్ కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. "ప్రధాని పర్యటనను డ్రామా అనడంలో పాక్ ఉద్దేశం ఏంటి అక్కడ పర్యటనే జరగలేదని, భారత్ కావాలని షో చేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. జమ్మూలో...