తెలంగాణ విద్యా శాఖ కీలక ఆదేశాలు..?

తెలంగాణ: తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్, టెన్త్ పరీక్షలపై గురువారం జిల్లాల కలెక్టర్లతో మంత్రి సబితా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు, టెన్త్ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు....