సినీ నిర్మాత వేధింపులతో నటి ఆత్మహత్యాయత్నం.?

ఆంజనేయులు న్యూస్: రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో కనిపించని చీకటి కోణాలు ఉంటాయి. ఇటీవల మహిళను వేధించి ఓ సినీ నిర్మాత అరెస్టు అయ్యాడు. అదే కోవలో మరో సినీ నిర్మాత ఓ మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇది తట్టుకోలేని ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు సీరియల్స్ లో రమేశ్వరి అలియాస్ భైరవి నటిస్తుంటారు. ఆమెకు వేలూరుకు చెందిన రాజాదేసింగ్ అలియాస్ సుబ్రమణి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనను తాను సినీ నిర్మాతగా...