గోడలో నోట్ల కట్టలు, వెండి ఇటుకలు..!
ముంబయిలో రూ.10 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ముంబయి: గోడను బద్దలుకొడితే ఏమవుతుంది. ఇటుకలు బయటపడతాయి. అదే ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం నేలలో, గోడలో ఏర్పాటుచేసిన రహస్య అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు రూ.13 లక్షల...