నేడు నగరంలో సీఎం కేసీఆర్ పర్యటన..!
గడ్డిఅన్నారంలో ఆసుపత్రి నిర్మించేది ఇక్కడే హైదరాబాద్ నారాయణగూడ: గడ్డి అన్నారంలోని పాత పండ్ల మార్కెట్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణం, అల్వాల్ రైతుబజార్ ఎదురుగా నిర్మించతల పెట్టిన 'టిమ్స్ 'ఆసుపత్రుల' పనులకు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. అల్వాల్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు తిరుమలగిరి కూడలి నుంచి బొల్లారం చెక్పోస్ట్ వరకు, బొల్లారం చెక్పోస్టు నుంచి...