కేసీఆర్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ లేఖ.!
మిగతా పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు?: బండి సంజయ్ హైదరాబాద్: ఎనిమిదేళ్ల తెరాస పాలనలో కేవలం పోలీసు పోస్టులనే భర్తీ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ శాఖలో కాకుండా మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడిస్తారని సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. "ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మీ నియంత పాలనకు అడ్డురాకూడదనే పోలీసు పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల...