జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ఆందోళన.!
హైదరాబాద్ పంజాగుట్ట: హైదరాబాద్ లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలుషిత నీటిని నివారించాలంటూ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఖాళీ కుండలతో నిరసన తెలిపారు. భాజపా నాయకులు గౌతమ్ రావు, శ్రీశైలంగౌడ్, శ్యాం సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. "నగరంలో కలుషిత నీళ్లు తాగి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదు....