Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 April 2022, 4:51 pm Posted by : Anjaneyulu Dega

ప్రశ్నిస్తే పీడీ కేసులు.. నిలదీస్తే ఐటీ దాడులు..?

పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో భట్టివిక్రమార్క

తెలంగాణ: మధిర,  ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ.. దాడులు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మధిర మండలం చిలుకూరులో గురువారం ‘పీపుల్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభమై ఆంధ్రా ప్రాంతం దొడ్డదేవరపాడు, వెల్లంకి సర్కిల్ మీదుగా తొర్లపాడు, సాయిపురం, తొండలగోపవరం చేరింది. అక్కడి నుంచి ఎర్రుపాలెం మండలం మీనవోలు చేరుకుంది. వివిధ గ్రామాల్లో భట్టి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య, రామాయంపేటలో సంతోష్, అతని తల్లి సజీవ దహనం ఘటనలు ఇందుకు నిదర్శమన్నారు. మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంతరావు పాదయాత్రలో పాల్గొన్నారు. తొండలగోపవరం వద్ద పాదయాత్రలో భట్టి విక్రమార్క వెంట నడిచారు..