
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల రైల్వే స్టేషన్ మీదుగా కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళవలసిన భాగ్యనగర్,ఇంటర్ సిటీ,రామగిరి,కాగజ్ నగర్ రైళ్లు నేటి నుంచి వచ్చే నెల 14 వరకు రద్దు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే అధికారులు తెలిపారు. జంమికుంట సమీపంలో రైల్వే ట్రాక్ లైన్ నిర్మాణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించగలరని రైల్వే అధికారులు కోరారు.