నేను లంచం ఇవ్వను.. మీరూ ఇవ్వకండి..!
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నుంచి మధిరకు ఓ వ్యక్తి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్ పంజాగుట్ట: నేను లంచం ఇవ్వను.. మీరూ ఇవ్వకండి అంటూ ఓ వ్యక్తి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి ఖమ్మం జిల్లా మధిరకు పాదయాత్ర చేపట్టాడు. అనుమతి లేదంటూ పంజాగుట్ట పోలీసులు అతడిని అడ్డుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం గ్రామానికి చెందిన మద్దినేని అనిల్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివానని, కొద్ది కాలంపాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో...