భక్తులకు తితిదే విజ్ఞప్తి…!

రద్దీ చూసుకుని తిరుమలకు రండి తిరుమల: టికెట్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులకు బుధవారం నుంచి దర్శనానికి అనుమతించనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు. మరో వైపు టికెట్లు లేకుండా వస్తున్న భక్తులతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం-2లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు పెద్ద సఖ్యలో బారులు తీరారు. దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే తితిదే సిబ్బంది క్యూలైన్లలోకి పంపిస్తున్నారు. మరో వైపు అలిపిరి నడకమార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. టిక్కెట్లు లేకుండా...