రోజువారీగా అందాల్సిన ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఇవే..!

శరీర జీవక్రియలకు వీటి అవసరం ఎంతో ఉంది శరీరానికి ఇవి ముఖ్యమైన పోషకాలు  క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లోపం ఉండొద్దు జింక్, ఫొలేట్, బి12 కూడా కీలకమైనవే శరీర జీవక్రియలు సాఫీగా సాగేందుకు విటమిన్స్, మినరల్స్ పాత్ర ఉంటుంది. ఇవి శరీరానికి ముఖ్యమైన పోషకాలుగా పనిచేస్తాయి. వేర్వేరు రకాల ఆహారంతోపాటు, కూరగాయలు, పండ్ల ద్వారా ఈ కీలకమైన విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందేలా చూసుకోవచ్చు. మిగిలినవి అవసరం లేదని కాదు. కానీ, ఆరోగ్యకరంగా ఉండాలంటే వీటి లోపం లేకుండా చూసుకోవాలి.  విటమిన్ డి క్యాల్షియం...