Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 April 2022, 4:20 pm Posted by : Anjaneyulu Dega

ఆసుపత్రి వర్కర్స్ పట్ల కక్ష పూరితం..!

ఆసుపత్రి వర్కర్స్ సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్..

ఆసుపత్రి వర్కర్స్ పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్న సూపర్ వైజర్స్, కాంట్రాక్టర్

కోత విధించిన వేతనాలు మొత్తం వర్కర్ల అకౌంట్లో వేయాలి.

మంచిర్యాల జిల్లా: సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం ఆసుపత్రి లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుండి పోరాటం ఫలితంగా నిన్నటి రోజున సదరు కాంట్రాక్టర్ 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించే క్రమంలో పూర్తిగా వేతనాలు చెల్లించకుండా అందులో ఒక వర్కర్ కి ఏకంగా 1500 నుండి 2000 రూపాయల వరకు కోత విధించాడు.దింతో వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు.ఇప్పటికైనా కోత విధించిన వేతనాలు వెంటనే వర్కర్లకు మొత్తం చెల్లించాలి.లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమలు  చేస్తామని డిమాండ్ చేస్తున్నాం..

ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమార్, నరేష్, శిలా, సుమలత, దుబ్బమ్మ, స్వరూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..