వివాదంలో జిల్లా కలెక్టర్..!

నిర్మల్ జిల్లా: తెలంగాణలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించేందుకు 21 మంది వీఆర్ఎలకు డ్యూటీ వేస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ కలెక్టర్ 21 మంది వీఆర్ఎల పేర్లను టెన్నిస్ హెల్పర్లుగా ప్రస్తావిస్తూ ఓ లిస్ట్ ను విడుదల చేశారు. ఈ లిస్ట్ లోని 21 మంది వీఆర్ఎలలో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వద్ద బంతులు అందించే...