Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 April 2022, 4:49 pm Posted by : Anjaneyulu Dega

పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు..

నిర్మల్ జిల్లా ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూదాన్ సంకల్ప మహాపాదయాత్రలో ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు అతిరథ కాంగ్రెస్ నాయకులు పాల్గొని పాదయాత్ర చేశారు. మహారాష్ట్ర సరిహద్దు వద్ద పాదయాత్ర సభ్యులకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు, పలువురు ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.