Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 April 2022, 7:31 pm Posted by : anjudega

పెండింగ్ చాలన్ల చెల్లింపుపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..?

మంచిర్యాల  ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్..

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ట్రాఫిక్ సర్కిల్ పరిధిలోని వాహన దారులు తమ వాహనా లపై ఉన్న పెండింగ్ చలాన్ల సబ్సిడీని సద్విని యోగం చేసుకోవాలని మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. చలాన్ల సబ్సిడీ గడువు గత నెల 31వ తేదితో ముగియాల్సివుండగా వాహనదారులకు మరింత ఊరట కల్గించేందుకు ఏప్రిల్ 15వ తేది వరకు పొడగించడం జరిగిందని, 2 వీలర్ లేదా 3 వీలర్ వాహనాల చలాన్లపై 75 శాతం రాయితీ, ఫోర్ వీలర్, హెవీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ, ఆర్టీసీ వాహనాల చలాన్లపై 75 శాతం రాయితీ కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.

చలాన్లను చెల్లించాలనుకునే వారు పేటీఎం వాలెట్ ద్వారా గానీ, టీఎస్ ఆన్లైన్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని వాహనదా రులంతా సద్విని యోగం చేసుకొని పెండింగ్ చలాన్లను చెల్లించాలని అన్నారు..