Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 April 2022, 5:46 pm Posted by : anjudega

కలెక్టర్ పేరిటే నకిలీ వాట్సప్ ఖాతా.!

నిర్మల్ జిల్లా: జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా నిర్వాహకుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలతో నకిలీ వాట్సప్ ఖాతాలు సృష్టించి, వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కలెక్టర్ ప్రొఫైల్ తొ నకిలీ వాట్సప్ సందేశాలు వస్తున్నాయని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ఆ నెంబరు నుంచి సందేశాలు వచ్చాయని, వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ శనివారం ప్రకటన జారీచేశారు. 62015 70373 నెంబరుతో ఉన్న వాట్సప్ వచ్చే ఆదేశాలు, సూచనలు ఎవరూ నమ్మవద్దన్నారు. ఇలాంటి నకిలీ నెంబర్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీన్నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.