Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 March 2022, 9:28 pm Posted by : Anjaneyulu Dega

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు..?

ఓటీఆర్ తప్పనిసరి: టీ.ఎస్.పీ.ఎస్.సీ

హైదరాబాద్: త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు  రానున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఓటీఆర్ ఐడీ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఓటీఆర్ లో మార్పులు చేసుకోవాలని తెలిపారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతలు నమోదు చేయాలని సూచించారు. చివరి నిమిషంలో నమోదు చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదముందని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్లు ఇలా…

టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు పేర్కొనాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.

దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, 1 – 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి.

అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తరువాత టీఎస్ పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.

ఒకవేళ సబ్మిట్ కన్నా ముందుగానే ‘లాక్అవుట్’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.